కోటసత్తెమ్మకు ఘనంగా సారె
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా మూడో రోజైన శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నిడదవోలు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారికి చీర, సారె, వివిధ రకాల స్వీట్లు, పండ్లు సమర్పించారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ పర్యవేక్షణలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు, హోమాలు, చండీ పారాయణ నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ
గెలుపు ఖాయం
తాళ్లపూడి: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడం ఖాయమని, మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. కొవ్వూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మద్దిపాటి సురేష్ శనివారం తలారి వెంకట్రావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. సురేష్‌కు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. పార్టీ పటిష్టానికి కృషి చేయాలని తలారి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరి రామకృష్ణ, జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేష్, పట్టణ కన్వీనర్ చిట్లూరి అన్నవరం, జిల్లా కార్యదర్శి జుట్టా ఏడుకొండలు, నాయకులు మారిశెట్టి సత్తిబాబు, వీరమళ్లు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పీజీ కోర్సులకు రేపటి
నుంచి స్పాట్ అడ్మిషన్లు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంతో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలో పీజీ కోర్సులలో ప్రవేశానికి సోమవారం నుంచి శుక్రవారం వరకూ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఎంఏ, ఎంకామ్, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ కోర్సులకు ఈ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఏపీ పీజీ సెట్‌లో అర్హత సాధించలేని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. సోమ, మంగళవారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సైన్స్, 10, 11 తేదీల్లో ఆర్ట్స్, కామర్స్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
అన్నవరప్పాడుకు
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు అరటి పండ్లతో అందంగా అలంకరించారు. స్వామివారిని చూసిన భక్తులు తన్మయులయ్యారు. దాతల ఆర్థిక సాయంతో 10 వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు. స్వామివారి పుష్పాలంకరణ, ప్రసాదానికి కూడా దాతలు సహకారం అందించారని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.
కోటసత్తెమ్మకు ఘనంగా సారె
కోటసత్తెమ్మకు ఘనంగా సారె
కోటసత్తెమ్మకు ఘనంగా సారె


