మహనీయుడు అంబేడ్కర్
రాజమహేంద్రవరం రూరల్: దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆ మహనీయుని చిత్రపటానికి వేణు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనా విధానాలు వేల సంవత్సరాలు మనలో ఉంటాయన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తే.. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్ మాజీ ఎంపీపీ రేలంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


