సమస్యల పరిష్కారానికి ఆందోళనలు
రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘ కోశాధికారి పెంకే సత్యనారాయణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. జనవరి 1 వరకూ నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన, 8న డీసీసీబీ బ్యాంచ్‌ల ఎదుట సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా, 16న రాష్ట్రంలోని అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రాలు అందజేయడం, 22న రాష్ట్రంలో అన్ని డీసీసీడీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన, 29న రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించడం చేస్తామన్నారు. జనవరి 5 నుంచి విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా 2019లో ప్రభుత్వం ఇచ్చిన జీఓ 36ను ఇప్పటికై నా అమలు చేయాలని ఆందోళనలకు సిద్ధమైనట్లు సత్యనారాయణ తెలిపారు.


