పెరవలి: తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, అధైర్య పడవద్దని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెరవలి మండలం ముక్కామలలో బుధవారం దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తుపాను సమయంలో ఇళ్లు నష్టపోయిన, పంటలు కోల్పోయిన వారికి అండగా ఉంటామన్నారు. తహసీల్దార్ కె నిరంజన్, ఎంపీడీఓ పద్మజ, వ్యవసాయాధికారిణి మేరీ కిరణ్ పాల్గొన్నారు.
నేటి నుంచి
యథావిధిగా పాఠశాలలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తుపాను ప్రభావం తగ్గడంతో జిల్లాలోగల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నిర్వహించాలని డీఈవో కే.వాసుదేవరావు బుధవారం ఆదేశించారు. తరగతి గదిలో ఉండే టేబుల్స్‌లో పాములు, విష పురుగులు చేరే అవకాశం ఉందని, తరగతి గదులన్నీ చెక్ చేయించిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఢిల్లీ సైన్స్ టూర్‌కి
ఇద్దరు విద్యార్థుల ఎంపిక
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏపీ సైన్స్ సిటీ సహకారంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఢిల్లీ సైన్‌్స్ టూర్‌కు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్టు జిల్లా సైన్స్ ఆఫీసర్ జి.శ్రీనివాస నెహ్రూ బుధవారం తెలిపారు. ఈ టూర్ నవంబర్ 6 నుంచి 8 వరకు ఉంటుందన్నారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గంటా యశస్విని, ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ ఈ ఢిల్లీ టూర్‌కి ఎంపిక అయ్యారన్నారు. ఈ టూర్లో విద్యార్థులు రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్, కల్చర్, నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం లాంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శిస్తారన్నారు.
సైన్స్ టూర్‌కు ఎంపికై న విద్యార్థినులు యశస్విని, జెస్సీ
రైతులను ఆదుకుంటాం
రైతులను ఆదుకుంటాం


