ఆర్‌ఎస్‌ఎస్ సేవలకు ‘వంద’నం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన రూ.100 విలువైన వెండి నాణేన్ని నగరానికి చెందిన నాణేల సేకరణకర్త పెద్దిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పోస్టులో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ సేవలకు గుర్తుగా కోల్‌కతా టంకశాల రూ.100 స్మారక ప్రూఫ్ నాణేన్ని విడుదల చేసిందన్నారు. దీనిపై ఒక వైపు జాతీయ చిహ్నం, ముఖవిలువ, మరో వైపు సింహం, భారతమాత చిత్రానికి వందనం చేస్తున్న స్వయం సేవకులు ఉన్నారన్నారు. భారతీయ కరెన్సీలో భారతమాత చిత్రం కనిపించడం ఇదే మొదటిసారని, ఈ నాణెం 40 గ్రాముల పూర్తి వెండితో తయారైందని తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ సేవలకు ‘వంద’నం


