తుపాను అయినా.. షాపు మూసేదేలే!
నల్లజర్ల: ఒక పక్క మోంథా తుపాను పెను ముప్పుగా దూసుకువస్తోంది. ఈ కారణంగా నల్లజర్ల మండలంలో భారీ ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండటంతో వివిధ గ్రామాల్లో ప్రజల్ని పోలీసు శాఖ అప్రమత్తం చేసి ఇళ్లకు వెళ్లేలా అప్రమత్తం చేసింది. హోటళ్లు, షాపులను మూసి వేయించారు.
కానీ, మద్యం షాపులు, దాబాల జోలికి పోలీసులు వెళ్లలేదని, వాటికి తుపాను ప్రమాదం ఉండదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ మాత్రం అన్ని షాపులు, వ్యాపార సంస్థలు మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేసినా.. మద్యం షాపులు, దాబాలు రాత్రి 8 దాటినా యథావిధిగా కొనసాగుతున్నాయి.


