ఏలేరు.. డేంజర్‌! | - | Sakshi
Sakshi News home page

ఏలేరు.. డేంజర్‌!

Oct 27 2025 8:16 AM | Updated on Oct 27 2025 8:16 AM

ఏలేరు

ఏలేరు.. డేంజర్‌!

రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

దిగువకు అదనపు జలాల విడుదల

అధిక మొత్తంలో ఒకేసారి వదిలేస్తే

ముంపు ముప్పు

పరీవాహక ప్రాంత ప్రజల్లో కలవరం

పిఠాపురం: జిల్లాలోని ఏలేశ్వరం వద్ద ఉన్న ఏలేరు జలాశయం డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం దాదాపు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, శనివారం నాటికే 85.57 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు సుమారు 23 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ తరుణంలోనే మోంథా తుపాను దూసుకొస్తూండటంతో మరింతగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్‌ లోనికి వరద నీరు భారీగా వచ్చి చేరుతూండటంతో అధికారులు రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఎక్కువ మొత్తంలో అదనపు జలాలు వదిలేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో, తమకు మరోసారి ముంపు ముప్పు తప్పదేమోనని పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కలవరపడుతున్నారు.

గత ఏడాది అపార నష్టం

గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఏలేరు అదనపు జలాలను కాలువ సామర్థ్యానికి మించి ఒక్కసారిగా వదిలేయడంతో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లో అపార నష్టం సంభవించింది. ఈ మూడు మండలాల్లోనూ వరి, వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునిగి, పనికి రాకుండా పోయాయి. మొత్తం 42 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 36 వేల ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. ఎకరానికి రైతులు రూ.25 వేల పెట్టుబడి పెట్టగా, అంతా వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. నాటి ఏలేరు వరదల కారణంగా సుమారు రూ.150 కోట్ల మేర నష్టం సంభవించింది. ఏలేరు కాలువకు గండి పడిన ప్రాంతాల నుంచి భారీగా ఇసుక, మట్టి వచ్చి పొలాల్లో మేటలు వేసింది. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతో పాటు గొల్లప్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. రాపర్తి ప్రాంతంలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. ఆ ఇసుక తొలగించుకోడానికి సైతం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు నాడు రూ.కోట్లు వెచ్చించి, ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) గండ్ల పూడ్చివేత పేరుతో కూటమి నేతలు తూతూమంత్రంగా పనులు చేసి, చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఎక్కడి గండ్లు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వరి పైరు చిరుపొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు మళ్లీ ఏలేరు నుంచి నీటిని ఒక్కసారిగా వదిలేస్తే తమకు మరోసారి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మరోసారి వరద ఖాయమని భావిస్తున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల పేరిట కాలువల్లో పూడికల తొలగింపు చేపట్టారు.

పెద్దాపురం మండలం కాండ్రకోటలో

రెగ్యులేటర్‌ మీదుగా ప్రవహిస్తున్న ఏలేరు

పిఠాపురం మండలం మాధవపురం

వద్ద ఏలేరు కాలువకు గత ఏడాది

సెప్టెంబర్‌లో గండి పడటంతో నీట

మునిగిన ఇసుకపల్లి గ్రామం, పంట చేలు

గత ఏడాది ఏలేరు కాలువకు మాధవపురం వద్ద పడిన గండి (దీనిని నేటికీ పూడ్చలేదు)

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు

మాధవపురం గండి పూడ్చి మా పంటలు కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) అధికారులకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేశాం. అయినా ఫలితం లేదు. ఇది పెద్ద గండి కాదని వదిలేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. వరద వచ్చినప్పుడు ఏలేరు అదనపు జలాలు, పీబీసీ నీరు ఒకేసారి వచ్చి పడటంతో ఈ కాలువకు గండి పడింది. దీనివల్లే గత ఏడాది సుమారు 2 వేల ఎకరాల్లో వరి పంట, వందలాదిగా ఇళ్లు నీట మునిగా యనే విషయం గుర్తించాలి. అటువంటిది ఇది పెద్ద గండి కాదనడం ఎంతవరకూ సమంజసమో అధి కారులే చెప్పాలి. అన్ని గండ్లూ పూడ్చివేస్తున్నామ ని అధికారులు, నేతలు చెబుతున్నారు. కానీ, అవసరమైన, ప్రమాదకరమైన ఇలాంటి గండ్లను ప ట్టించుకోవడం లేదు. మాధవపురం గండిని ఇప్ప టికై నా పూడ్చి, గట్టును పటిష్టపరచకపోతే వేలాది ఎకరాలు మరోసారి నీట మునగడం ఖాయం.

– వై.ప్రసాదరెడ్డి, రైతు, నాగులాపల్లి,

యు.కొత్తపల్లి మండలం

ఏలేరు.. డేంజర్‌!1
1/2

ఏలేరు.. డేంజర్‌!

ఏలేరు.. డేంజర్‌!2
2/2

ఏలేరు.. డేంజర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement