ప్రభుత్వమే ఆదుకోవాలి
రబీలో ధాన్యం అమ్మడానికి నానా పాట్లూ పడ్డాం. అది కూడా అమ్మి న ధాన్యం సొమ్ము చాన్నాళ్లకు కా నీ ఇవ్వలేదు. ఈ ఏడాదైనా ధా న్యం సక్రమంగా కొనుగోలు చేసి, రైతులకు ఎటు వంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారని అనుకో నే లోపే తుపాను గండం వచ్చి పడింది. అదే కను క జరిగితే రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– చిట్టీడి వెంకట సత్యనారాయణ,
వరి రైతు, పెరవలి
తుపాను వస్తే పంట దక్కదు
తుపాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు వరి పైరు నేలనంటింది. ఇప్పుడు తుపాను అంటున్నారు. అదే కనుక జరిగితే పంట దక్కదు.
– పిల్లా శ్రీనివాస్, వరి రైతు,
కొత్తపల్లి అగ్రహారం, పెరవలి మండలం
ఆది నుంచీ ఇబ్బందులే..
ఈ ఏడాది ఖరీఫ్ సాగులో నాట్ల దశ నుంచే ఇబ్బందులు పడు తున్నాం, వర్షాలకు నారు రెండు సార్లు పోయింది. డెల్టాలో వరి కోతలు నవంబర్ నెలలో ప్రారంభమవుతా యి. ఇప్పుడు తుపాను అంటున్నారు. ఈ పరి స్థితుల్లో ఖరీఫ్ పంట దక్కుతుందనే నమ్మకం రైతులకు లేదు. పెట్టుబడి అంతా వృథా.
– అధికారి పల్లపురాజు, రైతు, కానూరు
అగ్రహారం, పెరవలి మండలం
●
ప్రభుత్వమే ఆదుకోవాలి
ప్రభుత్వమే ఆదుకోవాలి


