
ప్రమాద స్థలం పరిశీలన
రాయవరం/ అనపర్తి: రాయవరంలోని శ్రీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో బాణసంచా ప్రమాద స్థలాన్ని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వంశీకృష్ణ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో ఎవరెవరున్నారు? ప్రధానంగా ప్రమాదానికి గల కారణాలపై న్యాయమూర్తి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన విధానం, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు, ప్రమాదం జరిగిన అనంతరం తీసుకున్న చర్యలను ఎస్సై డి.సురేష్‌బాబు వివరించారు. బాధితులతో మాట్లాడిన న్యాయమూర్తి వంశీకృష్ణ న్యాయ సహాయం కోసం ఇద్దరు లీగల్ వలంటీర్లను నియమించినట్టు తెలిపారు.