
అంతర పంటగా అశ్వగంధను సాగు చేయొచ్చు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆయిల్‌పామ్ తోటల్లో మూడేళ్ల వరకూ అశ్వగంధను అంతర పంటగా సాగు చేయవచ్చని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ సంస్థ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని నిర్కాను సందర్శించి అశ్వగంధ పంటను ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా సాగు చేయడానికి, అధిక దిగుబడులు పొందడానికి, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఉన్న అవకాశాలను విశ్లేషించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషుమాధవ్ మాట్లాడుతూ అన్ని నేలల్లో అశ్వగంధ వేయవచ్చని తెలిపారు. అంతే కాకుండా అశ్వగంధ సాగుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సహకరిస్తామన్నారు. అశ్వగంధ పంట మార్కెటింగ్, బైబ్యాక్ విధానాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. పలు అంశాలను విశ్లేషించి ఆయిల్‌ఫెడ్ సలహాదారుడు ఎ.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ముసాయిదాను రూపొందించడానికి నిర్ణయించారు. నిర్కా సంస్థ పరిధిలో చేస్తున్న మిరప, పసుపు పంట ఉత్పత్తులను తెలంగాణ ఆయిల్‌ఫెడ్ వారి విజయబ్రాండ్ స్టోర్స్‌లో చేర్చి అమ్మడానికి ఉన్న అవకాశాలను చర్చించి ఎంఓయూ ఏర్పాటు చేసి సంయుక్తంగా ముందుకెళ్లాలని రెండు సంస్థలు నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అధికారులు టి.సుధాకరరెడ్డి, ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, అభ్యుదయ రైతులు భాస్కర్, అప్పారావు, నిర్కా సంస్థ విజన్ హెడ్స్ కె.సరళ, రాజశేఖర్, ఎల్‌కే ప్రసాద్, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్తలు కస్తూరి, సుబ్బయ్య, సుమన్‌కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.