
బైబై గణేశా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందడి మొదలైంది. బొజ్జగణపయ్యను పూజించిన భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఇళ్లలో, పందిళ్లలో ఉన్న గణపతిని భక్తితో మేళాలు, డీజేలు, డప్పులు వాయిద్యాలతో నగర వీధుల్లో ఊరేగించి రాజమహేంద్రవరం వాటర్ వర్క్స్ వద్ద గోదావరి రేవు వద్దకు తీసుకువస్తున్నారు. భక్తితో పూజించిన గణపతిని అంతే భక్తితో గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు కాతేరు వద్ద గోదావరిలో కూడా గణపతి నిమజ్జనాలు జోరుగా సాగాయి. వాటర్ వర్క్స్‌రేవు వద్ద రాజమహేంద్రవరం నగరంతో పాటు, పరిసర ప్రాంతాల నుంచి రాత్రి 11.00 గంటలకు 198 విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసుశాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించారు.
గోదావరిలో నిమజ్జనం చేసేందుకు
క్రేన్ సహాయంతో పంటుపై పెడుతున్న గణపతి విగ్రహం