
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రెండో రోజు పవిత్రోత్సవాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ సారథ్యంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ పర్యవేక్షణలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయంలోని పురాతన కల్యాణ మండపంలో ఉన్న ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.