
28 నుంచి ఎంపీడీఓలకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 28 నుంచి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన 89 మందికి శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మొదటి బ్యాచ్‌లో 46 మంది ఎంపీడీఓలు హాజరవుతారన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తియిన తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ఉంటుందన్నారు.