
ఖరీఫ్‌కు రిలీఫ్
పెరవలి: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌కు ఊపిరులూదాయి. రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు 76,941 హెక్టార్లలో చేపట్టడానికి రైతులు సిద్ధంగా ఉండగా ఇప్పటి వరకు 55,021 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. జూలై 15 నాటికి పూర్తి అవ్వవలసిన వరి నాట్లు ఆలస్యంతో దీని ప్రభావం దిగుబడులపై పడుతుందని, ప్రకృతి వైపరీత్యాలకు పంటలు బలవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడటంతో ఖరీఫ్ సాగు కష్టాలతో మొదలైంది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటంతో ఖరీఫ్ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ముందస్తు సాగుకి రైతులను సన్నద్ధం చేయవలసిన అధికారులు రబీ ధాన్యం సొమ్ము ఇవ్వకపోవటంతో ఖరీఫ్ పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుత వర్షాలకు పుడమి పులకరించటంతో ఖరీప్ సాగు ఊపిరి పోసుకుంది. అయితే రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా లేవు. జిల్లాలో ఖరీఫ్ సాగుకి అన్ని రకాల ఎరువులు కలిపి 61,692 మెట్రిక్ టన్నులు అవసరం కాగా జూలై నెల 21వ తేదీకి 27,275 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. అయితే అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు చెబుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు 20 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారు. నెలాఖరుకు వరినాట్లు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు.
ఖరీఫ్ సాగు ఆలస్యానికి కారణాలు
జూన్ 1వ తేదీనే కాలువలకు నీరు వదలినా, ఖరీఫ్ పనులు చేపట్టలేదు. చిన్న కాలువల ఆధునీకరణ పనులు మే నేలాఖరులో చేపట్టటం వల్ల నీరు చిన్న, పిల్ల కాల్వలకు వదలలేదు. దీంతో జూలై నెలలో వరి నాడుమడులు వేయటం ప్రారంభించారు. పెట్టుబడికి ప్రభుత్వం ఎటువంటి సాయం అందించకపోవడం, రబీ ధాన్యం సొమ్ము నేటీకీ ఇవ్వకపోవటంతో రైతులు అఽధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఖరీఫ్ పనులు చేపట్టారు. దీనితో ఖరీఫ్ సాగు ఆలస్యం అయింది.
పెరవలిలో వరినాట్లు వేస్తున్న కూలీలు
నాలుగు రోజులుగా కురుస్తున్న
వర్షాలకు ముమ్మరంగా నాట్లు
జిల్లాలో 76,941 హెక్టార్లలో వరి సాగు
ఇప్పటి వరకు నాట్లు 55,021
హెక్టార్లలో నాట్లు
61,692 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 27,275 టన్నులే లభ్యం
ఎరువుల కొరత ఉన్నా
లేదంటున్న అధికారులు
జిల్లాలో ఎరువుల నిల్వలు ఇలా..
వివరం ఖరీఫ్ ప్రస్తుతం
అంచనా ఉన్నవి
(మెట్రిక్ టన్నులు)
యూరియా 26,465 9,416
డీఏపీ 6,420 2,461
ఎంఓపీ 4,806 2,758
ఎన్‌పీకే 18,607 8,365
ఎస్‌ఎస్‌పీ 5,394 4,275
61,692 27,275
నానా పాట్లూ పడుతున్నాం
ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. పెట్టుబడి కోసం నానా పాట్లు పడుతున్నాం. సమయానికి ఎరువులు దొరకటం లేదు, ఒక్కోటి ఒక్కోచోట తెచ్చుకుంటున్నాం.
దిడ్ల సంపతిరావు, రైతు, ఖండవల్లి
ప్రభుత్వం ధాన్యం సొమ్ము ఇస్తే చాలు
రబీ ధాన్యం సొమ్ము అందక ఖరీఫ్ పనులు చేపట్టలేదు. అప్పులు చేసి ఖరీఫ్ పంట పనులు చేపట్టాం. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోయినా కనీసం పండించిన పంట కొనుగోలు చేసి సమయానికి సొమ్ము ఇస్తే చాలు.
జుత్తుగ రంగయ్య, రైతు, ముక్కామల

ఖరీఫ్‌కు రిలీఫ్

ఖరీఫ్‌కు రిలీఫ్