
మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని సర్వమత ప్రార్థనలు
తాళ్లపూడి: కుట్ర పూరితంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్‌రెడ్డికి దేవుడి దయతో త్వరగా బెయిల్ రావాలని వైఎస్సార్ సీపీ నియోజక వర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. కొవ్వూరులో గురువారం ఎంపీ మిథున్‌రెడ్డికి త్వరగా బెయిన్ రావాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 12వ వార్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. మసీదులో ముస్లింలతో కలిసి నమాజు చేశారు. తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు బెయిల్‌పైనే బయట ఉన్నారని, ఆయన చేసిన అక్రమాలు బయట పడకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మిథున్‌రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించి రిమాండ్‌కు పంపిందని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కంఠమణి రమేష్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, జిల్లా అధికార ప్రతినిధి గంధం సాయి, మున్సిపల్ కౌన్సిలర్లు గీత, విల్లి పద్మ, నాయకులు ఉప్పులూరి సూరిబాబు, జుట్టా ఏడు కొండలు, సురేంద్ర, సుంకర సత్యానారాయణ, పద్మ, లక్ష్మణరావు, హనుమంతరావు, గంగాధర నాగేశ్వరావు, దక్షిణామూర్తి పాల్గొన్నారు.
మొదటి విడత డీసెట్
కౌన్సెలింగ్ పూర్తి
99 సీట్లకు 56 మంది మాత్రమే హాజరు
నల్లజర్ల: దూబచర్లలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఈ నెల 17 నుంచి 24 వరకు జరిగిన మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ముగిసినట్టు ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. డైట్‌కు కేటాయించిన 99సీట్లకు కేవలం 56మంది అభ్యర్థులు మాత్రమే హాజరై సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రవేశ పత్రాలు తీసుకున్నారు. సీనియర్ అధ్యాపకులు ఎన్.రామసుబ్రహ్మణ్యం, కెఎస్‌బీకే రాజ్‌కుమార్, కె.సరోజని, ఏఎస్‌ఆర్ ఆర్ గుప్తా ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్నారు.
డీఎడ్‌కు తగ్గుతున్న ఆదరణ
దూబచర్ల డైట్ కళాశాలకు 99సీట్లు కేటాయిస్తే కేవలం 56మంది మాత్రమే కౌన్సిలింగ్‌కు హాజరవడం చూస్తుంటే డీఎడ్‌కు ఆదరణ తగ్గుతున్నట్టు కనపడుతోంది. తరుచూ డీఎస్సీ నిర్వహించక పోవడం, డీఎడ్ శిక్షణ పూర్తయి ప్రైవేటు పాఠశాలల్లో రూ.7వేలు, రూ.8వేలకు పనిచేయడం ఇష్టం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి.
డాక్టర్ సీఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీకి
అనుమతులు రద్దు!
డీఎడ్ ప్రవేశాలకు సంబంధించి భీమవరం సీఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీకి ఎన్.సీ.డి.ఈ. ఈ ఏడాది అనుమతులు రద్దు చేసింది. తొలుత ఆ కళాశాలకు చెందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా దూబచర్ల డైట్ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. ఆ కళాశాలకు 71 సీట్లు కేటాయించారు. 17 నుంచి 24వ తేదీ వరకు జరిగిన మొదటి దఫా కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు ఎవరూ హాజరు కాలేదు. ఆ కళాశాలకు చెందిన 9మంది విద్యార్థులు దూబచర్ల డైట్ కళాశాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కన్వీనర్‌కు తెలియజేసి వారిని చేర్చుకోనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.