
క్రీడలతో శారీరక, మానసిక వికాసం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడల తో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎల్‌ఐసీ రాజమండ్రి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహూ అన్నారు. రాజమహేంద్రవరం సూర్య గార్డెన్స్‌లో బుధవారం ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి సత్యనారా యణ సాహూ మాట్లాడుతూ, విధి నిర్వహణలో బిజీగా ఉండే ఎల్‌ఐసీ ఉద్యోగులు ఇలాంటి పోటీలతో మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యం పొందవచ్చన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 82 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్టు తెలిపారు. క్యారమ్స్ ప్రపంచ, జాతీయ చాంపియన్లు అపూర్వ, పి.నిర్మల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ అని నిర్వాహకులు చెప్పారు. క్యారమ్స్ అంతర్జాతీయ రిఫరీ షేక్ జలీల్, చెస్ అంతర్జాతీయ రిఫరీ జీవీ కుమార్ పర్యవేక్షణలో పోటీలు కొనసాగాయి. ఎల్‌ఐసీ పీఅండ్‌ఐఆర్ మేనేజర్ ఎం.పూర్ణచంద్రరావు, స్పోర్ట్స్ బోర్డు మెంబర్లు సురేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ ఎస్‌డీఎం సాహూ
సౌత్ సెంట్రల్ జోన్
క్యారమ్స్, చెస్ పోటీలు ప్రారంభం