
కక్ష సాధింపులో భాగమే మిథున్‌రెడ్డి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశా రని, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబుల్లా ఖాన్ ఆరోపించారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే లేని లిక్కర్ కేసును సృష్టించి, అక్రమంగా అరెస్టు చే యడం దారుణమని మండిపడ్డారు. కూటమి పాలనలో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూండటంతో వైఎస్సార్ సీపీలోని కీలక నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నందుకే ప్రజ లు కూటమికి ఓట్లేశారని, కానీ నేడు వారి ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. కూటమి సర్కారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు.
పీజీఆర్‌ఎస్‌కు 234 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 234 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 101, పంచాయతీరాజ్ 39, పోలీస్ 22, విద్యుత్ 12, ఇతర శాఖలకు చెందినవి 58 చొప్పున అర్జీలు వచ్చాయి.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు
27 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్‌ఎస్)కు 27 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఏఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు స్వయంగా మాట్లాడి, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
23న ఐటీఐలలో రెండో
విడత అడ్మిషన్ కౌన్సెలింగ్
రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు దీనికి హాజరు కావాలని సూచించారు. పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జత జిరాక్స్ కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని వివరించారు.
27న జిల్లా స్థాయి యోగా పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యాన ఈ నెల 27న జిల్లా స్థాయి యోగాసన పోటీలు స్థానిక గౌతమ ఘాట్‌లోని శ్రీ జగద్గురు పీఠం(వరల్డ్ టీచర్స్ ట్రస్ట్)లో నిర్వహించనున్నారు. యోగా గురువు శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 10 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు సబ్ జూనియర్, 14 నుంచి 18 సంవత్సరాల వారికి జూనియర్, 18 నుంచి 28 సంవత్సరాల వారికి సీనియర్, 28 నుంచి 35 సంవత్సరాల వారికి సీనియర్–ఎ, 35 నుంచి 45 సంవత్సరాల వారికి సీనియర్–బి, 45 నుంచి 55 సంవత్సరాల వారికి సీనియర్–సి కేటగిరీల్లో 10 ఈవెంట్లలో ఈ పోటీలు నిర్వహిస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 7396 00 3444 నంబరులో సంప్రదించాలన్నారు.
జక్కంపూడికి అనపర్తి
మాజీ ఎమ్మెల్యే సంఘీభావం
అనపర్తి: పేపర్ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా పోరాడుతున్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. రాజాను సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన కలిశారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజా.. కార్మికుల సమస్యలపై చేస్తున్న పోరాటానికి తామెప్పుడూ తోడుగా ఉంటామని చెప్పారు.

కక్ష సాధింపులో భాగమే మిథున్‌రెడ్డి అరెస్టు