
నలుగురు యువకుల అరెస్ట్
950 గ్రాముల గంజాయి స్వాధీనం
మామిడికుదురు: నగరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం దాడి చేసి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 950 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కథనం మేరకు... నగరం గ్రామంలోని ఈదరాడ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే నీతిపూడి గణపతిరావు సమాధి వద్ద గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లగా అనుమానాస్పదంగా కనిపించిన యానాంకు చెందిన కనపర్తి వెంకటదుర్గ, పెద్దిరెడ్డి గోవిందరాజు, పల్లం గ్రామానికి చెందిన పెమ్మాడి నాగూర్, పుచ్చల్లంక గ్రామానికి చెందిన యన్నాబత్తుల వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 950 గ్రాముల గంజాయి దొరికింది. నలుగురిని అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేశామని ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. వారిని రిమాండు నిమిత్తం రాజోలు కోర్టుకు తరలించామని చెప్పారు.