
నరసన్న దేవస్థానానికి వెలుగులు
కోరుకొండ: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెలుగులు వచ్చాయి. కొంతకాలంగా స్వామివారి కొండపై వెలుగులు దూరమయ్యాయి. రాత్రిళ్లు దర్శన భాగ్యం కలగక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల సాక్షి దినపత్రికలో నిశీధిలో నరసన్న అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి అన్నవరం దేవస్థానం అధికారులు స్పందించి కోరుకొండ స్వామివారి ఆలయానికి విద్యుత్ వెలుగు లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. నారసింహుని దేవస్థానంలో కింద నుంచి కొండపైకి లైట్లు ఏర్పాటు చేయడంతో స్వామివారి గోపుర దర్శనం భక్తులకు ప్రాప్తించింది. దీనితో భక్తులు సంతోషిస్తున్నారు.

నరసన్న దేవస్థానానికి వెలుగులు