
బాంబు పేలుళ్లు
ఫ ఎగిరిపడిన బండరాళ్లు
ఫ ఇద్దరు మహిళలకు గాయాలు
తుని: పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనుల్లో భాగంగా వినియోగిస్తున్న బాంబు పేలుళ్లకు బండరాళ్లు ఎగిరిపడి తుని పట్టణం ఒకటో వార్డు డ్రైవర్స్ కాలనీలోని ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కట్రాళ్లకొండ తవ్వకానికి కాంట్రాక్టు సిబ్బంది బాంబులు పేల్చారు. దీంతో బండరాయి ఎగిరి గృహాల మధ్య పడింది. ఈ సంఘటనలో ఓ ఇంటి ప్రహరీ ధ్వంసం కావడంతో పాటు శాంతి, వీరమ్మ అనే ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వీరిని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి పగలు బాంబుల పేలుళ్లతో ఇళ్ల మధ్య కంపనాలు రావడంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి జన జీవనానికి అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాంబు పేలుళ్లు