
తండ్రిపై దాడి చేసిన తనయుడి అరెస్ట్
రాయవరం: స్థానిక రాజరాజేశ్వరి కాలనీలో తండ్రిపై సుత్తితో దాడి చేసిన తనయుడిని శనివారం అరెస్ట్ చేసినట్లు రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు విలేకరులకు తెలిపారు. ప్రతి రోజు తండ్రి గంటా శ్రీనివాస్ తిడుతున్నాడని, కోపం పెంచుకున్న కొడుకు పవన్‌కళ్యాణ్ ఈ నెల 17వ తేదీ రాత్రి దాడి చేశాడు. మండపేట సీఐ పి.దొరరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టి, నిందితుడు పవన్‌కళ్యాణ్‌ను అరెస్ట్ చేసి అనపర్తి జేఎఫ్‌సీఎం ముందు హాజరు పర్చగా నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.