
గోదారి ఇబ్బందులు
రాకపోకలకు బ్రేక్
అయినవిల్లి: ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిపై ఓ ప్రయాణికుడు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి పడబోతుండగా తోటి ప్రయాణికుడు కాపాడాడు. దీంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉండటంతో రేవులో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు.
పి.గన్నవరం: వరద వచ్చేసింది.. లంక వాసులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం గతేడాది వశిష్ట నదీపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం ఉదయం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 వేల మంది నివసిస్తున్నారు. గతంలో 200 మీటర్ల పొడవున మట్టితో నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రేవులో రెండు ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు ప్రారంభించారు. అలాగే వరద ఉధృతికి ఊడిమూడిలంక వద్ద మట్టి లారీల రాకపోకల కోసం నిర్మించిన రహదారి, యర్రంశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బాటలు కూడా కొట్టుకుపోయాయి. వైవీ పాలెం వద్ద బాటలు కొట్టుకుపోవడం వల్ల పి.గన్నవరం మండలానికి సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఇక్కడకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.49.5 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
ఫ జి.పెదపూడిలో వరద ఉధృతి
ఫ కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి
ఫ నాలుగు లంక గ్రామాలకు మార్గం కట్

గోదారి ఇబ్బందులు

గోదారి ఇబ్బందులు