ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న బీఎస్‌ఎఫ్ ఆర్‌ఎస్సైకి సన
కాకినాడ రూరల్: ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న బీఎస్‌ఎఫ్ ఆర్‌ఎస్సై ఆర్.దేవానందంను కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు, సిబ్బందితో కలిసి సన్మానించారు. ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దేవానందం అల్లుడి ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న కమాండెంట్ నాగేంద్రరావు పిలిపించి సన్మించారు.
దేశానికి సేవ చసిన మహనీయుడిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీఎస్‌ఎఫ్ ఆర్‌ఎస్సై దేవానందం మాట్లాడుతూ బీఎస్‌ఎఫ్‌లో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, ఆపరేషన్ సిందూర్‌లో తన వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ మోహన్‌రావు, చంద్రశేఖరరావు, రాము పాల్గొన్నారు.


