నవరత్నాలు నిలబెట్టాయ్..
నిడదవోలు మండలం కంసాలిపాలేనికి చెందిన సూరవరపు నాగలక్ష్మిది పేద రైతు కుటుంబం. ఎర్రకాలువ ఉధృతమైతే పంట నీట మునిగేది. దీంతో, పంట చేతికి అందక, అప్పుల బాధ భరించలేక భర్త నాగేశ్వరరావు 2009లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకోవడం నాగలక్ష్మికి కష్టంగా మారింది. ఇంటి వద్దే చిన్న కిరాణా షాపు పెట్టుకుని వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. గత ప్రభుత్వాలు చాలా కాలం వితంతు పింఛన్ కూడా మంజూరు చేయలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ కుటుంబ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. భర్త చనిపోయి కష్టాలు వెక్కిరించిన ఆ కుటుంబాన్ని నవరత్నాల పథకాలు నిలబెట్టాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో నాగలక్ష్మి కుటుంబానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఏకంగా రూ.3,92,500 మేర లబ్ధి చేకూరింది. 2021లో వచ్చిన ఎర్ర కాలువ వరదకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.34 వేలు, ఇన్‌పుట్ సబ్సిడీ రూ.12 వేలు, రైతు భరోసా ద్వారా ఐదేళ్లలో రూ.13,500 చొప్పున రూ.67,500 ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.72,048 డ్వాక్రా రుణమాఫీ జరిగింది. నాగలక్ష్మి డ్వాక్రా రుణం తీసుకుని పెద్ద కుమార్తె పెళ్లి చేసింది. మరో కుమార్తె సత్య శ్రావణికి ఏటా అమ్మ ఒడితో పాటు ట్యాబ్ అందజేశారు. కొడుకు సాయికృష్ణ పీజీ చదవడంతో జగనన్న విద్యాదీవెన అందుకున్నారు. – నిడదవోలు రూరల్
నవరత్నాలు నిలబెట్టాయ్..


