
వానలో తడుస్తూ.. సమస్యలపై ఎలుగెత్తుతూ..
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇలాగైన ప్రభుత్వ పెద్దల మనస్సు కరిగి, సానుకూలంగా స్పందించాలని కోరారు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పి)/సీహెచ్‌ఓల అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యాన సీహెచ్‌ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.