
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కడియం – రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడిచేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు.
నిడదవోలులో..
నిడదవోలు : చాగల్లు –నిడదవోలు రైల్వేస్టేషన్ మధ్యలో శుక్రవారం విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న రైలు నుంచి జారిపడి 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు నలుపు, సిమెంటు రంగు నెక్ బనియన్, నీలం రంగు ప్యాంట్ ధరించాడు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 94906 17090, 99480 10061 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అప్పారావు తెలిపారు.