డ్రగ్‌ ట్రేడర్స్‌ బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ ట్రేడర్స్‌ బంద్‌ విజయవంతం

May 21 2026 12:08 AM | Updated on May 21 2026 12:08 AM

అమలాపురం టౌన్‌: తమ డిమాండ్ల సాధన కోసం దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన మెడికల్‌ షాపుల బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా వర్తకులు తమ మెడికల్‌ షాపులను మూసివేసి బంద్‌ పాటించారు. జిల్లాలో దాదాపు 1,200 మెడికల్‌ షాపులు బంద్‌తో మూత పడ్డాయి. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో మెడికల్‌ వర్తక సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. అనంతరం వారు కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌కు అందజేశారు. మెడికల్‌ షాపుల వర్తకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అమలాపురంలో జరిగిన నిరననలో జిల్లా డ్రగ్స్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌వీఎస్‌ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ఫార్మశీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నకిలీ మందులు అమ్మకాల్లో ఇస్తున్న అనైతిక డిస్కౌంట్‌ విధానాన్ని విడనాడాలని కోరారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న జీఎస్‌ఆర్‌ 220, 817లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కొమ్మూరి వీసీహెచ్‌ ప్రసాద్‌, ఏఎస్‌వీ వెంకటేశ్వరరావు, మోకా వెంకట సుబ్బారావు, శిరగం వెంకటేశ్వరరావు, కాళ్లకూరి కృష్ణ ఈ నిరసనలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement