కాట్రేనికోన: మండలంలో చెయ్యేరు అగ్రహారంలో కనకదుర్గమ్మ ఆలయం పునర్నిర్మాణం విషయంలో సరిహద్దు రైతుకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం తలెత్తడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వివాద స్థలం సర్వే నెంబరు 441/1లో ఉన్న భూమిలో ఇరువర్గాలు ఏ విధమైన పనులు చేపట్టరాదని కాట్రేనికోన తహసీల్దార్ వి.రవికిరణ్ అన్నారు. శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకుని 145,164 సెక్షన్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశించా రు. తదుపరి ఉత్తరు్‌ువ్ల వచ్చేంత వరకు ఇరువర్గా లు భూమిలో పనులు చేపట్టరాదన్నారు. రెవె న్యూ ఆదేశాలతో రైతు చట్టాలను గౌరవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని కాట్రేనికోన ఎస్సై అవినాష్ అన్నారు.


