కొత్తపేట/రావులపాలెం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పాలకులను నిలదీద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉప సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ల మాజీ ప్రతినిధులను శనివారం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రావులపాలెం సీఆర్‌సీ ఫంక్షన్ హాల్లో జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, నరసాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అభినందనలు
జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా, లొంగకుండా వైఎస్సార్ సీపీ కోసం, ప్రజల పక్షాన నిలబడిన స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల్లో అత్యధిక శాతం వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న అక్కసుతోనే అధికార పార్టీ, ప్రభుత్వం ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు ఉన్న అధికారాలను తొక్కిపెట్టి, ప్రజాప్రతినిధుల హక్కులను హరించేలా పాలకులు వ్యవహరించారన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇదే ఐకమత్యంతో కలిసి రావాలని పార్టీ శ్రేణులకుపిలుపునిచ్చారు.
ప్రజల పక్షాన పనిచేయాలి
రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పదవీ కాలం పూర్తయ్యిందని విశ్రమించకుండా, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ ప్రతినిధులుగా ప్రజల పక్షాన పని చేయాలని సూచించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అందుకు అన్నగా, తమ్ముడిగా జగ్గిరెడ్డి నిలబడటమే కారణమని అన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన సాగించిందని, గతంలో ఎవరూ అమలు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, కుండ అన్నపూర్ణ, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, బొణం సాయిబాబు, తోరాటి సీతామహాలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చిలువూరి రామకృష్ణంరాజు, సాకా ప్రసన్న కుమార్, బొక్కా వెంకటలక్ష్మి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాకా మణికుమారి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, కనుమూరి శ్రీనివాసరాజు, బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను, జిల్లా యూత్ కార్యదర్శి గూడపాటి ప్రవీణ్ కుమార్, యాక్టివిటీ కార్యదర్శి గొలకోటి సూర్యప్రకాష్, జిల్లా పార్టీ యాక్టివిటీ మెంబరు షేక్ వల్లీబాబా, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పెదపూడి బాపిరాజు, జిల్లా పార్టీ కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చల్లా ప్రభాకరరావు పాల్గొన్నారు.
ఫ పంచాయతీ
మాజీ ప్రతినిధులకు జగ్గిరెడ్డి పిలుపు
ఫ పదవీ కాలం పూర్తయిన
సర్పంచ్‌లకు సత్కారం


