అమలాపురం టౌన్: వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) టి.నిషాంతి హెచ్చరించారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు మానటరింగ్ కమిటీలుఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలో ఉన్న రాజేశ్వరి హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ ఏజెన్సీలోని స్టాక్, డెలివరీ రికార్డులను పరిశీలించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ కొరత అనివార్యమైందన్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకే సిలిండర్లు అందించేందుకు అఽత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాణిజ్య వినియోగానికి గృహ సిలిండర్లను మళ్లించడం పూర్తిగా నిషేధమన్నారు. తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల సహాయ అధికారి శరత్, అమలాపురం తహసీల్దార్ వీఎస్ దివాకర్, సీఎస్‌డీటీ భారతి, జిల్లా తూనికలు, కొలతల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మగౌరవం కథకు
ప్రథమ స్థానం
రామచంద్రపురం: జిల్లా స్థాయి ఉగాది కథల పోటీలో రామచంద్రపురానికి చెందిన గోదావరి కవి ర్యాలి శ్రీనివాసు రచించిన ఆత్మగౌరవం కథకు ప్రథమ స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆలమూరు బాలమందిరం సాహితీ సంస్థ నిర్వహించిన ఈ ఉగాది కథల పోటీలో తన కథ ప్రథమ బహుమతి దక్కించుకున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణశ్రీ తెలిపారన్నారు. సమకాలీన అధ్యాపకులు ఎదుర్కొనే సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని ఆ కథ రచించానని తెలిపారు. ఆలమూరులో ఈ నెల 22న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తారన్నారు.
8న ఫుట్‌బాల్
అసోసియేషన్ ఎన్నిక
అమలాపురం రూరల్: జిల్లా క్రీడాఅభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏప్రిల్ 8న కోనసీమ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించాలని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వైఎస్‌వీ కుమార్ (నీలాద్రి) అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుందన్నారు. అనంతరం సభ్యుల వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన పత్రాలు తీసుకు రావాలని కోరారు. వివరాలకు 89851 33338, 95508 44046 నంబర్లను సంప్రదించాలన్నారు.


