ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అష్టోత్తర పూజలలో పెద్ద సంఖ్యలో దంపతులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి హుండీలు, కానుకల రూపంలో రూ.4,10,091 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 27 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల ప రిష్కార వేదిక కార్యక్రమానికి 27 అర్జీలు వచ్చా యి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ తమ చాంబర్ల నుంచి పోలీస్ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. అర్జీదారులతో జిల్లా పోలీస్ అధి కారులు ముఖాముఖీ చర్చించి వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎ స్సైలకు ఫోన్లు చేసి సూచనలు, ఆదేశాలు ఇచ్చా రు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదా లు, ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి.
ఉన్నత విద్యతో
మహిళా సాధికారత
అమలాపురం రూరల్: ఉన్నత విద్యతో మహిళా సాధికారత లభిస్తుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం అమలాపురం డిపో గ్యారేజ్ డీపీటీవో ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బోడసకుర్రు హెచ్‌ఎం బండారు సుభాషిణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో నాలుగు డిపోల నుంచి ఉత్తమ మహిళా ఉద్యోగులను నగదు బహుమతితో డీపీటీవో సత్కరించారు. అమలాపురం డిపో మేనేజర్ శర్మ, రామచంద్రపురం డిపో మేనేజర్ భాస్కరరావు, రాజోలు డిపో మేనేజర్ జేమ్స్, రావులపాలెం డిపో మేనేజర్ కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ గంగుమళ్ల రామలక్ష్మిదేవి, అసిస్టెంట్ మేనేజర్లు ప్రతిమాకుమారి, అచ్యుతాంబ, నాలుగు డిపోల సూపర్‌వైజర్ నంది వరహాల బాబు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
హెచ్‌పీవీ టీకాతో
గర్భాశయ క్యాన్సర్ దూరం
అమలాపురం రూరల్: మన ఆరోగ్యం –మన బాధ్యతని, హెచ్‌పీవీ టీకాను 14 ఏళ్లు దాటి 15 ఏళ్లు లోపు బాలికలకు వేయించి గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రచార బ్యానర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల బాలికల కోసం హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందన్నారు. దీని కింద ఏటా బాలికలకు ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకాలు వేస్తారన్నారు. తల్లి దండ్రుల సమ్మతితో జిల్లాలో ఉన్న 10,989 మంది బాలికలకు టీకా వేస్తామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, డీసీహెచ్ ఎస్ కే. కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.


