ప్రజా భద్రతకు ‘ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రజా భద్రతకు ‘ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌’

Mar 8 2026 7:29 AM | Updated on Mar 8 2026 7:29 AM

జిల్లాలో వివిధ రంగాలలో

రాణిస్తున్న సీ్త్ర మూర్తులు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఉన్నత చదువు చదివినా ప్రకృతి వ్యవసాయంతో మమేకం

అమలాపురం మండలం నల్లమిల్లికి చెందిన అప్పారి కృష్ణ ప్రశాంతి ఎంబీఏ చదువుకున్నారు. తండ్రి అప్పారి చిన వెంకట రమణ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌లో ఫార్మర్‌ మాస్టర్‌ ట్రైనీగా పనిచేస్తుండగా, ప్రశాంతి ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఎంబీఏ చదివినా ప్రకృతి వ్యవసాయంతో మక్కువ ఆమెను ఈ రంగం వైపు మళ్లించింది. చిన్ననాటి నుంచి తండ్రికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉన్నారు. ట్రాక్టర్‌ నడపడం, నాట్లు వేయడం, కోతలు కోయడం వంటి పనులతోపాటు ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండిస్తున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై పలువురికి శిక్షణ

ఇస్తున్నారు.

ముదితల్‌ నేర్వగ రాని విద్య గలదె ముద్దార నేర్పించినన్‌ అన్నారు చిలకమర్తి. మహిళలకు అర్థమయ్యేటట్టు చెప్పి, అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే పురుషులకు ఏ మాత్రం తీసిపోరని ఇప్పటికే పలుమార్లు రుజువైన సత్యం. ఉన్నత ఉద్యోగం, విద్యాబోధన, క్రీడారంగం, వైద్యం, వ్యాపారం, సేవా రంగం ఇలా చెప్పుకుంటూ పోతే పలు రంగాలలో మహిళా మణులు విజయాలు సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా రంగాలలో జిల్లాలోని మహిళా విజేతలపై ప్రత్యేక

కథనం.

సాక్షి, అమలాపురం

పరిశోధకురాలిగా రాణిస్తున్న శాస్త్రవేత్త నీరజ

శ్రీకాకుళానికి చెందిన డాక్టర్‌ బి.నీరజకు చిన్ననాటి నుంచి వైద్యురాలు కావాలని ఆకాంక్ష. కాని తరువాత వ్యవసాయంపై మక్కువతో ఆ రంగంలో శాస్త్రవేత్త అయ్యారు. 2013–14లో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో జీవ నియంత్రణ పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు శాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నారు. 2016లో అంబాజీపేటలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధన కేంద్రంలో ప్లాంట్‌ పాథాలజీ శాస్త్రవేత్తగా చేరారు. ఇప్పటి వరకు 52 పరిశోధన పత్రాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. నాలుగు పరిశోధన ప్రతాలకు ఉత్తమ పేపర్‌ పురస్కారాలు లభించాయి.

రిటైర్‌ అయినా

14 ఏళ్లుగా ఉచిత వైద్యం

40 సంవత్సరాల నుంచి అలుపెరగని సేవలందిస్తున్నారు అమలాపురానికి చెందిన కుడుపూడి విజయ. అమలాపురం మున్సిపాలిటీలో మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో వైద్య అధికారిగా 2012లో ఉద్యోగ విరమణ చేసినా... ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఉచితంగా సేవలందిస్తూ వైద్యులకు ఆదర్శంగా నిలిచారు. ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 1982లో అమలాపురంలో వైద్యాధికారిగా ఉద్యోగంలో చేరారు. మున్సిపాలిటీలో ఏకై క మాత శిశు సంరక్షణ కేంద్రం ఉన్న ఆ రోజుల్లో వేలాది మందికి ఆపరేషన్‌ లేకుండానే నార్మల్‌ డెలివరీలు చేశారు. సెలవులు పెట్టకుండా నిరంతరం పేద ప్రజలకు ేవైద్యసేవ చేయాలనే సంకల్పంతో చిన్నారులకు వ్యాక్సిన్లు అందిస్తూ... తల్లులకు వైద్య సేవ చేస్తూ తరిస్తున్నారు. ఇప్పటికీ ఏడాదికి ఐదు వేల మందికి పైగా చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. 2020–22 కరోనా సమయంలో భయపడకుండా వేలాది మందికి వ్యాక్సిన్‌లు వేశారు. భర్త ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ప్రోత్సాహంతో నిరంతరం వైద్య సేవలో తరిస్తున్నారు.

60 ఏళ్లుగా ఆగని పరుగు

అమలాపురానికి చెందిన మహబూబ్‌ షాహీరా, మహబూబ్‌ షకీలాలు సోదరీ మణులు. వీరిలో షాహీరా అథ్లెట్‌. ప్రస్తుతం 76 సంవత్సరాలు. తన 16వ ఏట నుంచి మొదలైన పరుగు గత అరవై ఏళ్లుగా నిరాటంకంగా సాగుతూనే ఉంది. 75 ఏళ్ల వయసులో గత ఏడాది పూణేలో జరిగిన మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని పరుగు పందెంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. ఆమె సోదరి షకీలా అథ్లెటిక్స్‌తో పాటు బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి. పలుసార్లు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నారు. రైల్వే క్రీడలలో కూడా రాణించారు. పదిసార్లు రాష్ట్ర జట్టుకు, నాలుగుసార్లు రైల్వే తరఫున పాల్గొన్నారు. 65 ఏళ్ల వయసులో కూడా గత ఏడాది పూణేలో జరిగిన మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీల్లో హై జంప్‌, లాంగ్‌ జంపుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.

తొలి మహిళా శతావధాని

అవధాన విద్య పురుషులకే అనే అభిప్రాయాన్ని తిరగరాసి మొదటి మహిళా శతావధానిగా ఆకెళ్ళ బాలభాను రికార్డు సాధించారు. అమలాపురం మండలం భట్నవెల్లి గ్రామానికి చెందిన సంస్కృత ఉపన్యాసకురాలు డాక్టర్‌ బాలభాను అమెరికాలో అవధానాలు చేసి విదేశాల్లో అవధానాలు చేసిన మొదటి మహిళగా తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్‌ుడ్సలో స్థానం దక్కించుకున్నారు. అవధానమంటే అసాధారణమైన ధారణశక్తి కావాలి. అప్పటికప్పుడు వేగంగా పద్యం చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. ప్రతిభ, కృషి, పట్టుదల ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ప్రథమ మహిళా శతావధాని, ప్రథమ మహిళా ద్విశతావధానిగా బాలభాను ఘనత సాధించారు. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం చదివారు. ఢిల్లీలో డాక్టర్‌ చిన్నారావు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్‌ సాధించారు. ఇప్పటి వరకు ఆమె 243 అవధానాలు, మూడు అష్టావధానాలు, శతావధానాలు చేశారు.

జిల్లాలో పోలీస్‌ శాఖ కార్డన్‌ సెర్చ్‌

అమలాపురం టౌన్‌: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అదుపునకు, ప్రజా భద్రతను పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్‌ శాఖ శనివారం ఉదయం ‘ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌’ నిర్వహించింది. అమలాపురం, రావులపాలెం, పామర్రు ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌ (తనిఖీలు) చేపట్టారు. ఎస్పీ కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌ తనిఖీల గురించి వివరించింది. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు, ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్‌లు తమ సిబ్బందితో అమలాపురంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొన్ని ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేశారు. వాహనాలను ఆపి సోదాలు చేశారు. రావులపాలెంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, రావులపాలెం సీఐ శేఖర్‌బాబు స్థానిక ఎస్సైలు, సిబ్బందితో కలసి అనుమానా స్పద ప్రాంతాలను, రద్దీ ప్రదేశాలను తనిఖీ చేశారు. పామర్రు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోటిపల్లి సావరం ప్రాంతంలో రామచంద్రపురం సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పామర్రు ఎస్సై సోమేంద్ర, ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్‌, రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పాత నేరస్తుల కదలికలను గమనించడంతోపాటు కొత్తగా ఆయా ప్రాంతాల్లోకి వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించి రికార్డు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్‌ ప్లేట్లు సరిగా లేని ద్విచక్ర వాహనాలను గుర్తించారు.

వైకల్యాన్ని అధిగమించిన సేవకురాలు

ఆమె తనకున్న వైకల్యాన్ని చూసి కుంగిపోలేదు. తనలా వైకల్యంతో బాధపడుతున్న సాటి వారికి సేవలందిస్తున్నారు రావులపాలెం మండలం వెదిరేశ్వరానికి బడుగు సుబ్బాయమ్మ. 2001లో ఆమె సేవలు మొదలయ్యాయి. తొలి రోజుల్లో పారా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవలందించారు. తరువాత ల్యాంప్‌ స్వచ్ఛంద సంస్థ స్టేట్‌ కోఆర్డినేటర్‌గా పని చేస్తూ దివ్యాంగులకు పింఛన్లు ఇప్పించడం, రుణ సౌకర్యం కల్పించడం, వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో పోరాటం చేస్తున్నారు. 2019లో నెదర్లాండ్‌కి చెందిన ఓ సంస్థ ఆమె సేవలకు రూ.లక్ష నగదు బహుమతి అందించింది. బెల్జియం దేశం ఉత్తమ సేవా అవార్డు కూడా ఆమె అందుకున్నారు. 2009లో గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు ఆమె అలుపెరగని పోరాటం చేశారు.

పర్యావరణ హితం కోరే వ్యాపారి

మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన తోట ఉమామహేశ్వరి పర్యావరణ హితం కోరే వ్యాపారి. తాను ఉపాధి పొందుతూ పలువురికి ఉపాధి కల్పిస్తున్న వ్యాపార వేత్తగా రాణిస్తున్నారు. 2021–22లో ఆమె సొంతంగా ‘సేవ్‌ నేచర్‌’ జ్యూట్‌ బ్యాగ్‌ల తయారీని ఒక మెషీన్‌తో ప్రారంభించారు. ఇప్పుడు 20 మెషీన్ల మీద జ్యూట్‌ బ్యాగ్‌లను తయారు చేస్తున్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి వ్యాపారాన్ని విస్తరించడమే కాదు.. తనతోపాటు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వద్ద 23 మంది ఉపాధి పొందుతున్నారు. డీఆర్‌డీఏ, నాబార్డుల సహకారంతో సుమారు 90 మందికి జూట్‌ బ్యాగ్‌ల తయారీలో శిక్షణ ఇచ్చారు. త్వరలో వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement