బాబు పాలనలో మహిళలకు భద్రత కరవు | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో మహిళలకు భద్రత కరవు

Mar 8 2026 7:29 AM | Updated on Mar 8 2026 7:29 AM

అల్లవరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో సంక్షేమ పథకాల ద్వారా జరిగిన మేలును, చంద్రబాబు పాలనలో అందని సంక్షేమ పథకాలను తలచుకొని అక్కాచెల్లమ్మలు బాధపడుతున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతా అనురాధ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని, మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహిళల సాధికారిత పూర్తిగా పడిపోయిందని, మహిళల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి మహిళల భద్రత కోసం దిశా చట్టాన్ని, దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని, ఎవరికై నా సమస్య వస్తే పది నిమిషాల్లో పోలీసులు స్పందించేలా దిశ యాప్‌ని రూపొందించి మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తే చంద్రబాబు దిశ చట్టాన్ని, యాప్‌ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్సార్‌ ఆసరా, చేయూత, అమ్మ ఒడి, కాపు నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల రుణాలు మంజూరు చేసి వైఎస్‌ జగన్‌ మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. నేరుగా రూ.1.89 లక్షల కోట్ల నిధులను మహిళల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు ఆడబిడ్డ నిధి ద్వారా రూ.18 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పెన్షన్‌, సున్నా వడ్డీతో పొదుపు సంఘాలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు ఇపుడు ఆ ఊసేలేదన్నారు. మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారిపై దాడులకు పాల్పడుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మహిళలకు అనురాధ శుభాకాంక్షలు తెలిపారు.

అంబేడ్కర్‌కు నివాళులు అర్పించిన జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌

పి.గన్నవరం: జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా శనివారం రాత్రి పి.గన్నవరం మూడు రోడ్ల సెంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. దిండిలోని హరిత రిసార్ట్స్‌కు వెళుతూ ఆయన పి.గన్నవరంలో కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా తొలుత స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ను దుశ్శాలువాలతో సత్కరించారు. స్థానిక దళిత నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సంతనూతల పాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు.

ముగ్గురు సర్వేయర్ల సస్పెన్షన్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్‌ చేసినట్లు సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. రిజిస్టర్‌ కాని సర్వేయ ర్స్‌ యూనియన్‌ పేరు చెప్పి విధులకు డుమ్మా కొట్టడంతో పాటు సర్వే పనులు సక్రమంగా చేయని కార ణంగా వీరిని సస్పెండ్‌ చేశామన్నారు. సస్పెండైన వారి లో యు.కొత్తపల్లి మండలం ఇసుకపల్లి సర్వేయర్‌ వై. గోపీ రమేష్‌, తుని మండలం కొలిమేరు సర్వేయర్‌ పి. సత్యానంద స్వామి, కాకినాడ రూరల్‌ రమణయ్యపేట సర్వేయర్‌ పి.జయపాల్‌ ఉన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement