పోలీసు ఆయుధాలు ఇలా పని చేస్తాయి.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు ఆయుధాలు ఇలా పని చేస్తాయి..

Mar 8 2026 7:29 AM | Updated on Mar 8 2026 7:29 AM

ఓపెన్‌ హౌస్‌లో విద్యార్థినులకు

ఎస్పీ మీనా అవగాహన

జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు కార్యాలయంలో మహిళా దినోత్సవం

అమలాపురం టౌన్‌: పోలీస్‌ స్టేషన్లు అంటే ఓ భయపడవద్దని, రక్షణ, భద్రత అందించే కార్యాలయాలుగా వాటిని భావించాలని చెబుతూ పోలీసుల ఆయుధాలు ఎలా పనిచేస్తాయో ఎస్పీ రాహల్‌ మీనా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా అమలాపురంలోని జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ను ఎస్పీ మీనా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పట్టణంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులకు పోలీసు ఆయుధాలు పనిచేసే విధానాలను అధికారులు వివరించారు. ఎస్పీ మీనా విద్యార్తినులకు పోలీస్‌ గన్‌లు పనిచేసే విధానంపై స్వయంగా అవగాహన కల్పించారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌, జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు, స్పెషల్‌ బ్రాంచి సీఐ వి.పుల్లారావు పాల్గొన్నారు. రీఫిల్స్‌, పిస్టల్స్‌, బాంబ్‌ డిస్పోజల్‌, క్లూస్‌ టీమ్‌ పరికరాలు, వాకీటాకీలు, వైర్‌లెస్‌ సెట్లు, లాకప్‌తోపాటు కమ్యూనికేషన్‌ సాధనాలు, శాసీ్త్రయ పరికరాలు ప్రదర్శనగా ఏర్పాటు చేసి వివరించారు. ఎీస్పీ మీనా మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో 100, 112 నంబర్లకు ఫోన్‌ చేసి పోలీస్‌ శాఖ నుంచి తక్షణ తోడ్పాటు పొందాలని సూచించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థినుల సమక్షంలో పోలీసు అధికారులు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement