‘నన్నయ’లో వాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

‘నన్నయ’లో వాకథాన్‌

Mar 8 2026 7:29 AM | Updated on Mar 8 2026 7:29 AM

రాజానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర మహిళా కమిషనర్‌ ఫ్లాగ్‌ షిప్‌ సహకారంతో ‘హానరింగ్‌ ది వారియర్‌ విటిమ్‌’ అనే థీమ్‌తో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శనివారం వాకథాన్‌ జరిగింది. ఈ ర్యాలీని వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీలో ఎన్‌ బ్లాక్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రధాన గేటు వరకు వెళ్లి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వరకు సాగింది. అక్కడ వారంతా మానవహారంగా ఏర్పడి మహిళా హక్కులు, వాటి పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలపై అవగాహన కలిగిస్తూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ఎడ్యుకేషన్‌ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement