తాళ్లరేవు: కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకటాయపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లను సరఫరా చేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్ ఇచ్చిన గుడ్డును పగలగొట్టి చూడగా కుళ్లిపోయి నల్లని పదార్థం బయటకు రావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి గుడ్లను చిన్నారులకు పెడితే వారి ఆరోగ్యం ఏం కావాలని వారు ప్రశ్నించారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణాలోపం, గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి గుడ్లను సరఫరా చేస్తున్నారని స్థానిక వార్డు సభ్యుడు సంగాని శ్రీనివాస్ ఆరోపించారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు, కాంట్రాక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుళ్లిన కోడిగుడ్లు


