బొత్సకు జగ్గిరెడ్డి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బొత్సకు జగ్గిరెడ్డి పరామర్శ

Mar 6 2026 8:18 AM | Updated on Mar 6 2026 8:18 AM

కొత్తపేట: ఇటీవల అస్వస్థతకు గురై కోలుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బొత్స సత్యనారాయణను జగ్గిరెడ్డి గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

మహిళా సాధికారతతోనే అభివృద్ధి

అమలాపురం రూరల్‌: సమాజ అభివృద్ధి మహిళా సాధికారతతోనే సాధ్యమవుతుందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవ ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో గురువారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు బాటలు వేయాలన్నారు.

బ్యాంక్‌ లింకేజీ, శ్రీనిధి లోన్‌న్‌, ఉన్నతి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్‌ ఫండ్‌ కింద మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జేసీ టి.నిషాంతి, కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీఓ జి మమ్మీ, ఐసీడీఎస్‌ పీడీ కె. నాగమణి ,డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement