మామిడికుదురు: మొగలికుదురు గ్రామంలోని కూరగాయల వ్యాపారి ఉర్రింక రాఘవ కూరగాయల దుకాణంలో బాహుబలి బీట్రూట్ దుంపలు గురువారం అబ్బుర పర్చాయి. సాధారణంగా అర కిలో, కిలో బరువు ఉండే బీట్రూట్ దుంపలు రెండున్నర కిలోలు ఉండడం ఇక్కడ విశేషం. కర్ణాటక రాష్ట్రంలోని కోలాపూర్ నుంచి ఈ దుంపలను దిగుమతి చేసుకున్నామని వ్యాపారి రాఘవ తెలిపారు. తన 40 ఏళ్ల కూరగాయల వ్యాపారంలో ఇంత పెద్ద బీట్రూట్ దుంపల్ని చూడడం ఇదే మొదటి సారి అని చెప్పారు. వీటిని స్థానికులు అశ్చర్యంగా చూశారు. వీటిని చూసి అబ్బుర పడ్డారు.


