పునర్విక వైద్యానికి రూ.1.10 లక్షల సాయం
అంబాజీపేట: అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్వికకు అంబాజీపేట ఫ్రెండ్స్ ఫరెవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సంస్థ శనివారం రూ.1.10 లక్షల సాయం అందజేసింది. బాలిక వైద్యం కోసం పలువురి నుంచి విరాళాలు సేకరించి ఈ మొత్తం సమకూర్చినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆ సొ మ్మును కర్నూలులో పునర్విక తండ్రి సురేష్‌కు అందజేశామన్నారు.
నరేంద్రపురం
పంచాయతీకి పవర్ కట్
పి.గన్నవరం: వీధి లైట్ల బిల్లులు చెల్లించని కారణంగా మండలంలోని నరేంద్రపురం గ్రామ పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు ఇటీవల పవర్ కట్ చేశారు. దీంతో నాలుగు రోజులుగా విద్యుత్ లేక పంచాయతీ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలోని సచివాలయానికి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. నరేంద్రపురం గ్రామంలోని వీధి లైట్లకు సంబంధించి సుమారు రూ.16 లక్షల మేర బిల్లులు విద్యుత్ శాఖకు బకాయి పడ్డారు. పంచాయతీలో నిధులు లేకపోవడంతో వాటిని చెల్లించలేదు. అయితే గ్రామ పంచాయతీ, సచివాలయాలకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇటీవల రూ.1.16 లక్షలు చెల్లించారు. వీధి లైట్ల బిల్లులను చెల్లించని కారణంగా పంచాయతీకి మాత్రమే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో నాలుగు రోజుల నుంచి పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి.
3న భీమేశ్వరాలయం
మూసివేత
రామచంద్రపురం రూరల్: చంద్ర గ్రహణం సందర్భంగా ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయాన్ని ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు మూసివేయనున్నారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని శనివారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ, నిత్య కై ంకర్యాల అనంతరం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.
పది పరీక్షలకు సర్వం సిద్ధం
ఉప్పలగుప్తం: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పా ట్లూ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు తెలిపారు. ఉప్పలగుప్తం మండలం గోపవరం, టి.చల్లపల్లి, గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈవో నాగేశ్వరరావు మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా 19,320 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కానుండగా, వారి కోసం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సీఎస్, ఒక డీవో, అవసరమైన చోట ఏడీవోల నియామకం చేపట్టామన్నారు. అనంతరం విద్యార్థులను వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి వారి విద్యాస్థాయిని తెలుసుకున్నారు. రైజింగ్ స్టార్లుగా ఉన్న విద్యార్థులను షైనింగ్ స్టార్లుగా తీర్చిదిద్దాల్సి ఉందని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గతేడాది కన్న మెరుగైన ఫలితా లు సాధించాలన్నారు. ఎంఈవో ఎస్.సత్యకృష్ణ, హెచ్‌ఎంలు జి.కనకదుర్గ, ఎ.వరలక్ష్మి, జి.స్వామిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సైల సేవలు అభినందనీయం
అమలాపురం టౌన్: పోలీస్ శాఖలో 40 ఏళ్లకు పైగా పనిచేసిన ఎస్సైలు ఎన్.నాగేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వరరావుల సేవలు అభినందనీయ మని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన ఆ ఇద్దరు ఎస్సైలకు ఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం వీడ్కోలు సభ నిర్వహించారు. ఇప్పటి వరకూ నాగేశ్వరరావు ఎస్పీ కార్యాలయంలోని డీసీఆర్‌బీ కోర్టు మోనటరింగ్ సెల్‌లో, వెంకటేశ్వరరావు డీఎస్‌బీ (ద్రాక్షారామ ఎటాడ్డ్ ఎస్సైగా)గా పనిచేశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ తదితరులు ఘనంగా సత్కరించారు. వారికి పోలీస్ శాఖ తరఫున జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పునర్విక వైద్యానికి రూ.1.10 లక్షల సాయం


