భావానికి రూపం మాతృభాష
● అమ్మభాషను కాపాడుకోవడం
అందరి బాధ్యత
● భాషాభివృద్ధితోనే జాతి..
సాంస్కృతిక వైభవం
● నేడు అంతర్జాతీయ
మాతృభాషా దినోత్సవం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): భావ వ్యక్తీకరణకు సులభమైన మార్గం మాతృభాష. మాతృభాషా తృణీకారం.. మాతృదేవీ తిరస్కారమని స్వయంగా గాంధీజీయే దాని ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. జాతి సాంస్కృతిక వికాసానికి మూలం మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర భాషలు నేర్చుకోవడం అనివార్యమైనా ఆ ప్రభావం మాతృభాష ఉనికికి భంగం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మాతృభాషలను కాపాడుకోవాలని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
నేపథ్యం ఇదీ..
మాతృభాష కోసం బెంగాల్ యువకుల ఆత్మబలిదానం రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి బీజం పడింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
తెలుగు రాకపోవడం గొప్పదనం!
పిల్లలకు కాన్వెంట్ చదువులు చెప్పిస్తూ తెలుగు రాయడం, చదవడం నేర్పని తల్లిదండ్రులు ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. మా పిల్లలకి తెలుగు రాదని. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోకూడదనే ప్రాధమిక బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.
సంస్కృతం ప్రాముఖ్యత..
ఆధునిక యుగంలో కూడా సంస్కృతానికి ప్రాధాన్యం తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్, ఏఐ, భాషాశాస్త్రం మొదలైన రంగాలలో సంస్కృత భాష పరిశోధనలకు ఉపయోగపడుతోంది. సంస్కృతం శాసీ్త్రయ నిర్మాణం, వ్యాకరణం, పదజాలం ఆధునిక సాంకేతికతకు ఎంతో ఉపయోగపడతాయి.
లిపిలేని భాషలెన్నో
కోయ, రెల్లి వంటి భాషలకు లిపి లేదు. అయినా వారి భాషకు వారు చాలా గౌరవం ఇస్తారు.
భాషను కాపాడుకోవడం బాధ్యత
తెలుగు అక్షరం ఒక్కటి, వెయ్యి సంవత్సరాల సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. భాషను కాపాడటం ఉద్యమం కాదు.. అది మన బాధ్యత. మాతృభాషను మన్నించని సమాజం, తన భవిష్యత్తునే మసకబార్చుకుంటుంది. మాతృభాషా దినోత్సవం ఒక వేడుక కాదు. ఆత్మగౌరవానికి శంఖారావం.
– డాక్టర్ పీవీబీ సంజీవరావు, ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళశాల తెలుగుశాఖాదిపతి
భాష నిలిస్తే భావం వ్యక్తమవుతుంది
మాతృభాష అంటే అమ్మ ఒడిలో మొదలైన మృదు స్వరం, మన ఆత్మకు ఆది నాదం. భాషతో భావం నిలుస్తుంది. భావం నిలిస్తే భవిష్యత్తు వెలుగుతుంది. – కండేపు సునీత, రచయిత్రి
భాషల తల్లి సంస్కృతం
సంస్కృతం, ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి. ఇది అనేక భాషలకు మూలం. సంస్కృతం నేర్చుకోవడం ద్వారా, మనం మన పూర్వీకుల జ్ఞాన సంపదను అర్ధం చేసుకోవచ్చు.
– పి.శ్రీవల్లి, ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్
ఉర్దూ అందమైన లిపికి ప్రసిద్ధి
తియ్యని భాష ఉర్దూ. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సంగమ త్రివేణి. ప్రతి మనస్సును తాకే మధురవాణి. అందు, దేశ విదేశీ భాషలలో ఇది ప్రత్యకమైనది. ఉర్దూలోని సాహిత్యం, పాటలు, ఏవైనా ఎద లోతుల్ని తాకుతాయి.
– రబీర్ మొహమ్మద్ అప్తాబ్, న్యాయవాది
భావానికి రూపం మాతృభాష
భావానికి రూపం మాతృభాష
భావానికి రూపం మాతృభాష
భావానికి రూపం మాతృభాష


