ఆటో ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

ఆటో ఢీకొని  వ్యక్తి మృతి

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

కాజులూరు: ద్వారపూడి–యానం రహదారిలో కాజులూరు మండలం కోలంక వద్ద ఆటో ఢీకొని దుగ్గుదుర్రు శివారు పొలమూరుపాడుకు చెందిన వినకోటి కొండబాబు (36) మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండబాబు తన మోటారుబైక్‌పై పాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కోలంక అటుకుల మిల్లు వద్దకు వచ్చేసరికి ద్రాక్షారామ నుంచి యానం వెళుతున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొండబాబు తలకు బలమైన గాయం కావడంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్సుకి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కొండబాబు మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్సై ఎం.మోహన్‌కుమార్‌ పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కోలంకలో ఆటో ఢీకొని మృతి చెందిన వినకోటి కొండబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement