ప్రైమరీ.. కిరికిరి
ఫ ఫౌండేషన్ స్కూళ్లపై వేటుకు సిద్ధం?
ఫ ఐదుగురు కంటే తక్కువ ఉంటే
మూసివేతే
ఫ జిల్లాలో 169 చోట్ల మూతపడే అవకాశం
ఫ సరికాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైమరీ స్కూళ్ల వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో పడింది.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తెచ్చిన సంస్కరణలే అందుకు కారణమైంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ సాకుతో ఐదుగురు, అంతకంటే తక్కువగా విద్యార్థులున్న స్కూళ్లను క్రమంగా ఎత్తివేసే ధోరణిలో ప్రభుత్వం ఉంది. ఈ వివరాలను విద్యాశాఖ సేకరించడం చూస్తుంటే ప్రాథమిక విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రమాదంలో పడే సూచన కనిపిస్తోంది. అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని పైకి అధికారులు చెబుతున్నా, ఇప్పటికే వివరాలు సేకరించి మూసివేత దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.
లెక్క తేల్చి..
విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిన స్కూళ్లను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. తొలిదశలో ఐదుగురి కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలల (ఫౌండేషన్, బేసిక్)ను గుర్తించే పనిలో పడింది. జిల్లాలో ఐదుగురి కంటే తక్కువ మంది ఉన్న పాఠశాలలు దాదాపు 169 వరకూ ఉంటాయని లెక్క తేలినట్టు సమాచారం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి నివేదిక రూపొందించి విద్యా శాఖకు పంపించారు. ఇక సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడమే తరువాయి. సంక్రాంతి తర్వాత విలీనం జరుగుతోందనే ప్రచారం విద్యాశాఖలో ఉంది. ఇదిలా ఉంటే మూసివేసే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను, అదే పాఠశాలలో పనిచేస్తున్న మిడ్ డే మీల్ వర్కర్లు, శానిటరీ ఆయాలను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది.
మూసివేసే దిశగా మరికొన్ని..
ఫ ముమ్మిడివరం నియోజకవర్గం పరిధి కాట్రేనికోన మండలం మొక్కలతిప్పలో ఇద్దరు, కుండలేశ్వరంలో ఐదుగురు, పి.లక్ష్మివాడలో నలుగురు, గిడ్డివారిపేటలో ఐదుగురు, నాగిచెరువులో ఇద్దరు చొప్పున విద్యార్థులు ఉన్నారు. కొప్పిగుంట ఎంపీపీఎస్‌లో అసలు విద్యార్థులే లేరు. ఐ.పోలవరం మండలం ఐ.కొత్తపల్లి, చాకిరేవు చెరువు, రామరాజుమెరక, జి.వేమవరం నంబర్–2లో ఐదుగురు చొప్పున, భవానీపేట, మురమళ్ల, కరవాకులంకల్లో నలుగురు చొప్పున, కేశనకుర్రు పెదపేట, టి.కొత్తపల్లిలో ఒకరు చొప్పున ఉన్నారు.
ఫ కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో ఒకరు, గోపాలపురంలో ఇద్దరు, దేవరపల్లి కొత్తపాలెంలో నలుగురు, పొడగట్లపల్లిలో ముగ్గురు, రాళ్లపండి, జుత్తుగపాడులో ఐదుగురు చొప్పున చదువుతున్నారు.
ఫ పి.గన్నవరం నియోజకవర్గం పరిధి అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు, కడలివారిపాలెం, గంగలకుర్రు అంబేడ్కర్ నగర్, వాకలగరువు బుల్లె కాలనీ స్కూళ్లలో ఐదుగురు విద్యార్థులు చొప్పున ఉన్నారు.
పాఠశాలల విభజన ఇలా..
చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పాఠశాలలను సంస్కరణల పేరుతో విభజించింది. ఒకటి, రెండు తరగతులు ఉన్న పాఠశాలలను ఫౌండేషన్ స్కూళ్లుగా, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా చేసింది. బేసిక్ ప్రైమరీ స్కూళ్లు గ్రామానికి రెండు, మూడు ఉండొచ్చు. ఇందులో ఒక స్కూల్‌ను మోడల్ ప్రైమరీ స్కూల్‌గా మార్చింది. ఇందులో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గ్రామానికి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలగా, ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ప్రాథమికోన్నత పాఠశాలగా, ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలుగా, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు హైస్కూల్ ఫ్లస్‌గా విభజించింది. దీనివల్ల అమలాపురం నియోజకవర్గం పరిధిలోని అల్లవరం మండలం తుమ్మలపల్లి ఫౌండేషన్ స్కూల్‌లో కేవలం నలుగురు విద్యార్థులు చదువుతున్నారు. కామనగరువు అప్పనపేట, బండారులంక కాపాటి వీధి స్కూళ్లలో ముగ్గురు, పేరూరుపేట, పేరమ్మ అగ్రహారం, మున్సిపల్ పాఠశాల (చిన్న పిల్లల పార్కు వద్ద) నలుగురు, ఎంపీఎల్ సీతాపతిరావుపేటలో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఐదుగురు లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు మూతపడనున్నాయనే వార్త మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఇప్పటికే మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో భాగంగా పలుచోట్ల సింగిల్ నంబర్ స్కూళ్లుగా మారాయి. ఇప్పుడు ఆ సింగిల్ నంబర్ స్కూళ్లను కూడా మూసివేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర చేయడంపై ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణం ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలహీనపర్చే చర్యలను అడ్డుకుంటాం. ఐదుగురు లోపు విద్యార్థులున్న పాఠశాలలను వేరే పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. ఇది ప్రాథమిక పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.
–జీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
పరిస్థితి దిగజారుతోంది
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఈ వ్యవస్థ బలహీనమవుతోంది. విద్యార్థుల చేరికలు ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో ఐదుగు రు లోపు విద్యార్థులున్న పాఠశాలలను వేరే పాఠశాల ల్లో విలీనం చేయడంతో పరిస్థితి దిగజారుతోంది. –కె.కల్యాణ్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ
హామీని విస్మరించడమే..
విద్యా సంస్కరణల్లో భాగంగా ఐదుగురు లోపు ఉన్న పాఠశాలలను అక్కడే ఉంచుతామని, మూసివేయమని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని విస్మరించి మూసివేసేందుకు చర్యలు తీసుకుంటే హామీని విస్మరించడమే అవుతుంది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి. –పి.నరేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్)
ప్రాథమిక విద్యకు తూట్లు
ఐదుగురు లోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయడమంటే ప్రాథమిక విద్యకు తూ ట్లు పొడవడమే. ఇది సహేతుక మైన నిర్ణయం కాదు. దీనివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశముంది. దీనిని వెనక్కి తీసుకోవాలి.
–ధీపాటి సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ
ప్రైమరీ.. కిరికిరి
ప్రైమరీ.. కిరికిరి
ప్రైమరీ.. కిరికిరి
ప్రైమరీ.. కిరికిరి


