కనుల వైకుంఠం.. షిష్ఠి సంబరం
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి షిిష్ఠి ఉత్సవాలు కోనసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్యుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకాలంకరణలో ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. అనేక చోట్ల అన్నసమారాధనలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాజోలు మండలం కడలి కపోతేశ్వరస్వామి ఆలయంలో షష్ఠి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కల్యాణమూర్తులైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారిని సర్ప వాహనంపై ఊరేగించారు. అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరంలో ఉన్న వల్లీ దేవసేన సమేత బాలసుబ్రహ్మణ్యస్వామి షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని 42 అడుగుల స్వామి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
– అమలాపురం రూరల్/అల్లవరం


