11న మాదిగల ఆత్మీయ కలయిక
అమలాపురం రూరల్: అమలాపురం మండలం పేరూరు కొంకాపల్లిలోని సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వచ్చే నెల 11న ఉదయం 10 గంటలకు మాదిగల ఆత్మీయ కలయిక జరుగుతుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తెలిపారు. మండలంలోని రోళ్లపాలెం గ్రామంలో నేదునూరి నాతానియేలు నివాసం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో మాదిగల ఆత్మీయ కలయిక పోస్టర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడికి శ్రీరాములు, నూటుకుర్తి సత్యనారాయణ, బడుగు శ్రీనివాసరావు, పెదపూడి శ్రీనివాసరావు, మంద రామకృష్ణ, సవరపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానాకి
విరివిగా విరాళాలు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు నాయర్ నిఖిల్, వెంకట సత్యపావని దంపతులు బుధవారం రూ.25 వేలు విరాళం అందజేశారు. ఈ సొమ్మును దాత ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. దాతను ఆలయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
అన్నదాన ట్రస్టుకు..
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన ట్రస్టుకు బెంగళూరుకు చెందిన పోతుకూచి కామేశ్వరిమాధవ్, సబితా దంపతులు, నవదీప్, జోషి దంపతులు రూ.20,116 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ఉద్యోగులకు బుధవారం అందజేశారు. విరాళం అందించిన దాత దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి దాతను అభినందించారు.
‘కల్ట్’ షూటింగ్ ప్రారంభం
బోట్‌క్లబ్: అస్త్ర మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించనున్న ‘కల్ట్’ సినిమాకు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో డైరెక్టర్ హరీష్ ముహూర్తపు షాట్‌ను క్లాప్ కొట్టి బుధవారం ప్రారంభించారు. నూతన నటీనటులతో సినిమాలను నిర్మిస్తున్నట్లు కో నిర్మాత ప్రసాద్ తెలిపారు. హీరో శ్రీమంత్, హీరోయిన్ అక్షర మాట్లాడుతూ యువతలో క్రికెట్ పట్ల ఉండే ఇష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీస్తున్నట్టు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తీస్తున్నటు తెలిపారు. గతంలో సర్కర్ , ఆలోచించు అర్జున్ తదితర సినిమాలు తీశామన్నారు.
11న మాదిగల ఆత్మీయ కలయిక
11న మాదిగల ఆత్మీయ కలయిక


