ముక్కంటి.. శరణంటి
రామచంద్రపురం రూరల్: కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఐ.పోలవరం మండలం మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ద్రాక్షారామ క్షేత్రంలో వేంచేసి ఉన్న మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరిలో స్నానమాచరించిన భక్తులు భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాణిక్యాంబా అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
							ముక్కంటి.. శరణంటి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
