రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ
అమలాపురం రూరల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. బ్యాడ్మింటన్ సింగిల్‌లో విజేతగా నందకిషోర్, డబుల్స్‌లో మొదటి స్థానంలో ఆదిత్య రామ్, గౌతమ్‌కుమార్, అదేవిధంగా బాక్సింగ్ అండర్ 63.5–67 కిలోల విభాగంలో ఓఏ దిలీప్ ద్వితీయ, అండర్ 67–71 కిలోల విభాగంలో ఆర్.మోహన్‌రాజ్ ప్రథమ స్థానం సాధించారన్నారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠరావు, బాస్కెట్ బాల్ కోచ్ ఐ.భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


