వైద్య సేవలు మెరుగుపరచకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు మెరుగుపరచకుంటే చర్యలు

Nov 4 2025 7:02 AM | Updated on Nov 4 2025 7:02 AM

వైద్య సేవలు  మెరుగుపరచకుంటే చర్యలు

వైద్య సేవలు మెరుగుపరచకుంటే చర్యలు

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

అమలాపురం రూరల్‌: అమలాపురం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైద్య సేవలు మెరుగుపరచకుంటే చర్యలు తప్పదని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగం ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో నెలకు సుమారు 120 ప్రసవాలు మాత్రమే నిర్వహించడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశా రు. నెలకు 1,500 ప్రసవాలు జరిగేలా ప్రసూతి వైద్య సేవలను బలోపేతం చేయాలని ఆదేశించారు. సరైన వసతులు లేక పేదలు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. జేసీ టి.నిషాంతి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సీహెచ్‌ రతన్‌రాజు, డీఈ ఎం.చక్రవర్తి డీఎంహెచ్‌ఓ ఎం.దుర్గారావు దొర, డీసీహెచ్‌ ఎస్‌.కార్తిక్‌ పాల్గొన్నారు.

ఫ గ్రామీణ దూర ప్రాంతాల ప్రజలకు హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ సేవలందించడానికి మొబైల్‌ ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ – టెస్టింగ్‌ సెంటర్‌ ఐసీటీసీ వాహన సేవలు మరింత కీలకం కానున్నాయని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌ వద్ద హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నియంత్రణకు కొత్త సంచార ఐసీటీసీ సేవా వాహనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ సంచార వాహనం ఇంటింటికి వెళ్లి కౌన్సెలింగ్‌, టెస్టింగ్‌ తదితర సేవలు అందిస్తుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర, అదనపు డీఎంహెచ్‌ఓ భరత్‌ లకి్‌ష్మ్‌ పాల్గొన్నారు.

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: జిల్లాలోని తీర ప్రాంతంలో భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను నేపథ్యంలో అంకితభావంతో సేవలు అందించిన వివిధ క్యాడర్లకు చెందిన 185 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement