
వ్యక్తి అదృశ్యం
యానాం: పట్టణ పరిధిలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పునీత్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. తాళ్లరేవు మండలం పటవల, రాఘవేంద్రపురానికి చెందిన 25 ఏళ్ల పేరాబత్తుల మనోహర్ ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించడం లేదని సాపిరెడ్డి శివవరప్రసాద్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదృశ్యమైన మనోహర్ ఆ రోజు బైక్‌పై ఇంటినుంచి యానాం బాలయోగివారధి వద్ద దొడ్డి గంగమ్మ ఆలయం వద్దకు వచ్చాడని అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వివరాలు తెలిసిన వారు యానాం ఎస్పీకి 0884–2324800, 2321 210 నంబర్‌లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.