
కలసిమెలషి
● కుటుంబానికి ఆమె ఆధారం
● జీవిత పయనంలో భర్తకు చేదోడువాదోడు
● నేడు భార్యల ప్రశంసా దినోత్సవం
రాయవరం: కుటుంబం అనే బండి సక్రమంగా నడవాలంటే భార్యభర్తలు కలసిమెలసి పయనించాలి. దారిలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. ఈ ప్రయాణంలో భార్యల పాత్ర చాలా కీలకం. కార్యేషు దాసీ..కరణేషు మంత్రి..భోజ్యేషు మాత....అంటూ జీవిత భాగస్వామితో భార్య ఎలా ఉండాలో మన పూర్వీకులు చెప్పారు. అందమైన జీవితం, ఆరోగ్యకర సమాజం, చక్కటి కుటుంబానికి మూలం వైవాహిక బంధం. సంసార రథ చక్రం సాఫీగా పరుగు తీసేందుకు ఇరుసు ధర్మపత్ని. కుటుంబానికి చుక్కాని ఆమె. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ మూడో ఆదివారం ప్రపంచ భార్యల ప్రశంసా దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం
సర్దుబాటు తప్పనిసరి
సంసార జీవనం సాఫీగా సాగిపోవాలంటే సర్దుబాటు తప్పనిసరి. సాధక, బాధలను సహృదయంతో అర్థం చేసుకోవాలి. కుటుంబం, భర్త, పిల్లలు, బంధువులపై చూపే విధేయత, వినయం, త్యాగం ధర్మపత్నికే చెల్లుతుంది. అయితే అదనపు కట్నం కావాలనో పరసీ్త్ర వ్యామోహంలోనో భార్యలను వేధించే భర్తలున్నారు. చాలామంది మాత్రం భార్యలను గౌరవిస్తూ, అభిమానిస్తూ ప్రేమగా చూసుకుంటున్నారు. కలిసిమెలసి పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.