
భార్యపై ప్రేమతో..
కరోనా కారణంగా 2021 మే 22న నా భార్య సత్యవేణి ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె చూపిన ప్రేమాభిమానాలు ఇప్పటికీ నన్ను కదిలిస్తాయి. నిత్యం నా కళ్ల ముందు ఆమె రూపం నిలవాలనే తలంపుతో మందిరం ఏర్పాటు చేసుకుని, దానిలో నా భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే రోజూ మందిరానికి వెళ్లి భార్య విగ్రహాన్ని చూస్తుంటాను.
– కొవ్వూరి సత్యనారాయణరెడ్డి,
విశ్రాంత లెక్చరర్, పసలపూడి, రాయవరం మండలం
ఆమెతోనే జీవితం
భార్యగా దుర్గాభవాని రావడంతో నా జీవితం మలుపు తిరిగింది. భార్యాభర్తలు అంటే ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం, గౌరవం ఉండాలి. నేను ఎప్పుడూ ఆమెతో అలాగే ప్రవర్తిస్తాను. తన ఇష్టాలను, అలవాట్లను గౌరవిస్తాను. ఆమె కూడా నా విషయంలో అలాగే ఉంటుంది. కుటుంబం సాఫీగా ముందుకు సాగాలంటే నమ్మకంగా చాలా అవసరం. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం ఆనందంగా సాగిపోతుంది. – భార్యతో యండమూరి శ్రీనివాస్,
ఎస్‌జీటీ, మధురవారిపేట,
ఉప్పలగుప్తం మండలం

భార్యపై ప్రేమతో..